హైదరాబాద్, జూలై 9: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఆసుపత్రుల నిర్వహణ సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ మరో ఆసుపత్రిని కొనుగోలు చేసింది. తాజాగా వైజాగ్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న క్యూఎన్ఆర్ఐ హాస్పిటల్ని హస్తగతం చేసుకున్నది. పూర్తిగా నగదు రూపంలో జరగనున్న ఈ ఒప్పందం విలువ రూ.75 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
క్యూఎన్ఆర్ఐకి వైజాగ్ మధ్యలో 200 పడక గదుల సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిని నిర్వహిస్తున్నది. 1.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఏర్పాటైన ఈ ఆసుపత్రితో 500 మంది వరకు ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి క్యూఎన్ఆర్ రూ.62 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఒప్పందం వచ్చే నెల రోజుల్లో పూర్తికానున్నట్లు తెలుస్తున్నది.