నాలుగేండ్లలో రూ.4.30 లక్షల కోట్లు
- మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమపై పీడబ్ల్యూసీ రిపోర్ట్
న్యూఢిల్లీ, జూన్ 24: భారత్‌లో మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ వచ్చే నాలుగేండ్లలో జోరుగా వృద్ధిచెందుతుందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఏడాదికి 8.8 శాతం చొప్పున చక్రగతిన వృద్ధిచెందుతూ 2026 సంవత్సరానికల్లా విలువ రూ.4.30 లక్షల కోట్లకు చేరుతుందని పీడబ్ల్యూసీ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. దేశీ మార్కెట్లో ఇంటర్నెట్ సేవలు, మొబైల్ డివైజ్‌లు వ్యాప్తిచెందడంతో పాటు డిజిటల్ మీడియా వృద్ధికి నేతృత్వం వహిస్తుందని, సాంప్రదాయ మీడియా క్రమ వృద్ధిని కనపరుస్తుందన్నది. ‘గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా అవుట్‌లుక్ 2022-26’ పేరుతో విడుదలైన నివేదికలో కీలకాంశాలు…
భారత్‌లో మొత్తం వార్తా పత్రికల ఆదాయం 2.7 శాతం చొప్పున చక్రగతిన వృద్ధిచెందుతూ 2026 నాటికి రూ.29,945 కోట్లకు చేరుతుంది. 2021లో ఇది రూ.26,378 కోట్లు. ఫ్రాన్స్, యూకేలను వెనక్కునెట్టి 2026లో భారత్ ఐదో పెద్ద న్యూస్‌పేపర్ మార్కెట్‌గా ఎదుగుతుంది. అలాగే ప్రపంచంలోని ప్రింట్ న్యూస్పేపర్ల అమ్మకాలు కేవలం ఇండియాలోనే వృద్ధి చెందుతాయన్నది. డెయిలీ ప్రింట్ న్యూస్పేపర్ల సగటు అమ్మకాలు 1.3 శాతం చొప్పున వృద్ధిచెందుతూ 2026కల్లా 13.9 కోట్లకు చేరతాయని పీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఈ సంఖ్య ప్రపంచంలో డెయిలీ ప్రింట్ వార్తా పత్రికల్లో మూడో వంతు అని, మొత్తం కాపీల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న చైనాను 2025కల్లా ఇండియా అధిగమిస్తుందన్నది.
- వచ్చే నాలుగేండ్లలో ఓటీటీ వీడియో సర్వీసుల పరిశ్రమ రూ.21,031 కోట్లకు చేరుతుంది. ఇందులో రూ.19,973 కోట్లు సబ్స్క్రిప్షన్ ఆధారిత సర్వీసుల ద్వారా, 1,058 కోట్లు వీడియో ఆన్ డిమాండ్ ద్వారా సమకూరుతాయి.
- టీవీ అడ్వర్టైజింగ్ 2026కల్లా 43,000 కోట్లకు పెరుగుతుందని, అమెరికా, జపాన్, చైనా, యూకేల తర్వాత ఇండియా ఐదో పెద్ద టీవీ అడ్వర్టైజింగ్ మార్కెట్‌గా నిలుస్తుందన్నది.
- ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ మార్కెట్ చక్రగతిన 12.1 శాతం వృద్ధితో 2026 కల్లా రూ.28,234 కోట్లకు పెరుగుతుంది.
- జనాభా పరిమాణం, మొబైల్ ఇంటర్నెట్ వీడియో వినియోగం పెరుగుతున్నందున, ఓటీటీ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా 5జీతో ఓటీటీ వీడియో స్ట్రీమ్స్ తదితర సర్వీసులకు డిమాండ్ పెరుగుతుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఆదాయం కొవిడ్ ముందస్తు సంవత్సరంతో పోలిస్తే 2026కల్లా రెట్టింపు అవుతుంది. వీటి ఆదాయం వచ్చే నాలుగేండ్లలో చక్రగతిన 14.10 శాతం చొప్పున వృద్ధిచెంది రూ.21,032 కోట్లకు చేరుతుంది.
- మ్యూజిక్, రేడియో, పొడ్కాస్ట్ విభాగం ఏడాదికి 9.8 శాతం చొప్పున వృద్ధి చెందుతూ నాలుగేండ్లలో రూ.11,536 కోట్లకు చేరుతుంది.
- వీడియో గేమ్స్, ఈస్పోర్ట్స్ ఆదాయం 2026కల్లా రూ.37,535 కోట్లకు పెరుగుతుందని అంచనా.
- భారత సినీ పరిశ్రమ 2026 కల్లా 16,198 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా. ఇందు లో రూ.15,849 కోట్లు బాక్సాఫీసు ద్వారా, రూ.349 కోట్లు అడ్వర్టైజింగ్తో సమకూరుతాయి. 2021లో అమెరికా, చైనా తర్వాత మూడో పెద్ద సినీ పరిశ్రమగా ఉన్న భారత్ చిత్ర పరిశ్రమ వచ్చే నాలుగేండ్లలో చక్రగతిన 38.3 శాతం చొప్పున వృద్ధిచెందుతుందని అంచనా. కొవిడ్ ముందస్తు సంవత్సరంలో 190 కోట్ల సినిమా టికెట్లు విక్రయంకాగా, 2020లో అవి 85 శాతం క్షీణించి 27.8 కోట్లకు తగ్గిపోయాయని, 2021లో 37.9 కోట్లకు పెరిగాయని నివేదిక తెలిపింది.
- గ్లోబల్ బాక్సాఫీసు ఆదాయం 2026కల్లా 49.4 బిలియన్ డాలర్లకు (రూ.3.87 లక్షల కోట్లు) చేరుతుంది.
- గ్లోబల్ ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ ఆదాయం వచ్చే నాలుగేండ్లలో 468.4 బిలియన్ డాలర్లకు (రూ.36.70 లక్షల కోట్లు) చేరుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

