ఉప్పల్, నవంబర్ 28: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఉప్పల్లోని చిలుకానగర్లో గురువారం నూతన శాఖను ప్రారంభించింది. బీవోబీ జనరల్ మేనేజర్, హైదరాబాద్ జోనల్ హెడ్ రితేశ్ కుమార్ చేతులమీదుగా ఇది మొదలైంది. బ్యాంక్ కస్టమర్లకు ఇక్కడ అన్నిరకాల సేవలు అందుబాటులో ఉంటాయని, రుణాలపై వడ్డీరేటు తక్కువేనని చెప్పారు.
కాలనీవాసులు బ్యాంక్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, హైదరాబాద్ జోన్లో ఇది 430వ శాఖ. నార్త్ రీజియన్లో 61వ బ్రాంచ్ అని డీజీఎం సుధాకర్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ నార్త్ రీజియన్ హెడ్ సీవీఎస్ చంద్రశేఖర్, బిజినెస్ డెవలప్మెంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంవీఎస్ సుధాకర్, బ్రాంచ్ అధిపతి ఎం సందీప్ పాటిల్ పాల్గొన్నారు.