న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: సామాన్యుడి ముక్కుపిండి రుణాలను వసూలు చేస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులు..కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన వేలాది కోట్ల రూపాయలను రైటాఫ్ చేస్తున్నాయి. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేసిన పీఎస్బీలు..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.29 వేల కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలం)లో పీఎస్బీలు రూ.29 వేల కోట్లను మాఫీ చేశాయని వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రద్దు చేసిన రూ.23 వేల కోట్ల కంటే ఇది అధికం.