న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం మళ్లీ అంతేవేగంతో తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ బలహీనంగా ఉండటంతో దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.99 వేల దిగువకు పడిపోయింది. రూ.1,000 తగ్గిన పదిగ్రాముల ధర రూ.98,400కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.99,400గా ఉన్నది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి రూ.1,400 తగ్గి రూ.98,500కి దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఒక్కశాతం తగ్గి 3,291 డాలర్లకు, వెండి 33 డాల్ల వద్ద కొనసాగుతున్నది.