ఆదివారం 29 నవంబర్ 2020
Business - Oct 23, 2020 , 02:16:01

ప్రమోద్‌ మిట్టల్‌ దివాలా

ప్రమోద్‌ మిట్టల్‌ దివాలా

లండన్‌: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన లక్ష్మీ మిట్టల్‌ సొదరుడు ప్రమోద్‌ మిట్టల్‌ దివాలా తీశారు. ప్రస్తుతం ఆయనకు 2.5 బిలియన్‌ పౌండ్ల అప్పు ఉన్నది. బ్రిటన్‌లో అత్యధిక రుణాలు ఉన్నవారిలో ప్రమోద్‌ ఒకరని ‘ఇండియా టూడే’ పత్రిక వెల్లడించింది. ప్రమోద్‌ తండ్రి పేరిట 170 మిలియన్‌ పౌండ్ల అప్పు ఉండగా, ఆయన కుమారుడు దివేశ్‌ పేరుమీద 2.4 మిలియన్‌ పౌండ్లు, ఆయన భార్య సంగీత పేరు మీద 1.1 మిలియన్‌ పౌండ్లు, ఆయన బావ మరిది అమిత్‌ లోహియా పేరు మీద 1.1 మిలియన్‌ పౌండ్ల అప్పు ఉన్నట్టు తెలిపింది.