హైదరాబాద్, డిసెంబర్ 6: గనుల రంగంలో కమర్షియల్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌కు చెందిన పీపీఎస్ మోటర్స్…స్కానియా కమర్షియల్ వాహన సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో దేశవ్యాప్తంగా టిప్పర్లను విక్రయించడానికి, మరమ్మత్తులు చేయడానికి వీలు పడనున్నది. ఈ సందర్భంగా పీపీఎస్ మోటర్స్ ఎండీ రాజీవ్ సంఘ్వీ మాట్లాడుతూ..స్కానియాతో జట్టుకట్టడం చాలా సంతోషంగా ఉన్నదని, మైనింగ్ ట్రక్కులను ప్రత్యేకంగా కస్టమర్లకు అందించడానికి మరింత సులభతరం కానున్నదన్నారు.