
ఊహించిన విధంగానే గతవారం మార్కెట్ కరెక్షన్కు గురైంది. మంగళవారం నాటి గరిష్ఠ స్థాయి నుంచి 733 పాయింట్ల కరెక్షన్ కేవలం నాలుగు రోజుల్లోనే జరిగింది. 20, 50 రోజుల చలన సగటులకు దిగువన ముగియడంతో స్వల్పకాలికంగా మార్కెట్ టెక్నికల్లీ వీక్‌గా మారింది. గతవారం విక్స్ ఏకంగా 14 శాతం పెరగడంతో రానున్న రోజుల్లో ఒడిదుడుకులు మరింత ఎక్కువగా ఉండేందుకు సూచనలున్నాయి. గత శుక్రవారం నిఫ్టీ భారీ విక్స్‌తో డోజీ క్యాండిల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మార్కెట్లో అనిశ్చితికి, ఊగిసలాటకు కూడా సంకేతాలను ఇచ్చింది. డోజీ క్యాండిల్ కనీస స్థాయి 17,485 మద్దతుగా పనిచేయనున్నది. ఈ స్థాయికి దిగువన మాత్రమే మార్కెట్ మరింత బలహీనపడుతుంది. అలాగే డోజీ క్యాండిల్ గరిష్ఠ స్థాయి 17,708 రెసిస్టెన్స్‌గా పనిచేయనున్నది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 4 శాతం మేర పతనమయ్యాయి. దీంతో మార్కెట్ మొత్తంగా బలపడినైట్టెంది. దీనికితోడు అంతకుముందు వారం వరకు బలంగా కనిపించిన ఐటీ ఇండెక్స్ 7 శాతం, ఫార్మా ఇండెక్స్ 5.2 శాతం మేర గతవారం పతనం కావడం వల్ల మార్కెట్లో ర్యాలీకి అవసరమైన లీడింగ్ సెక్టార్ లేకుండా పోయింది. బడ్జెట్ వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు.