Poco X6 Neo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన మిడ్ రేంజ్ ఫోన్.. పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్, 108 మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరా తదితర ఫీచర్లతో వస్తున్నది. నారో బెజెల్స్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. వర్చువల్ గా 24 జీబీ వరకూ ర్యామ్ పెంచుకోవచ్చు.
పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) ఫోన్.. 108 -మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ 3x లాస్‌లెస్ ఇన్ సెన్సర్ జూమ్తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది. బ్లూ, గోల్డెన్ కలర్ ఆప్షన్లలో వస్తుందని భావిస్తున్నారు. రెడ్ మీ నోట్ 13ఆర్ ప్రో ఫోన్‌ను రీబ్రాండ్ చేసి పోకో ఎక్స్6 నియో ఫోన్ ను ఆవిష్కరిస్తున్నారని సమాచారం. గతేడాది నవంబర్ నెలలో చైనా మార్కెట్లో ఆవిష్కరించిన రెడ్ మీ నోట్ 13 ఆర్ ప్రో ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ.23 వేలు (199 చైనా యువాన్లు) పలికింది.