Poco X6 Neo 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎక్స్6 నియో 5జీ (Poco X6 Neo 5G) ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.67-అంగుళాల డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్, 108 మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వచ్చింది.
పోకో ఎక్స్6 నియో 5జీ (Poco X6 Neo 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.17,999లకు లభిస్తుంది. ఆస్ట్రల్ బ్లాక్, హరిజాన్ బ్లూ, మార్షియన్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్స్ మొదలయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.1000, పాత ఫోన్ ఎక్స్చేంజ్ కింద మరో రూ.1000 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.
పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1920 హెర్ట్జ్ పల్స్ విడ్త్ మాడ్యులేషన్ (పీడబ్ల్యూఎం) డిమ్మింగ్తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తున్నది.
పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo 5G) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ కలిగి ఉంటుంది. వర్చువల్గా 24 జీబీ ర్యామ్ వరకూ పొడిగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్ డేట్స్, నాలుగేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది.
పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo 5G) ఫోన్ బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 108 మెగా పిక్సెల్ శాంసంగ్ ఐసో సెల్ హెచ్ఎం6 ప్రైమరీ కెమెరా విత్ 3ఎక్స్ సెన్సర్ జూమ్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటది.