ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో తన పొకో ఎం5 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా పొకో ఎం5పై రూ.3750 డిస్కౌంట్ అందిస్తున్నది. ఈ నెల 15 నుంచి 19 వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్లో ఆవిష్కరించినప్పుడు పొకో ఎం5 4జీబీ వేరియంట్ రూ.12,499, 6జీబీ వేరియంట్ రూ.14,499 (ఎక్స్ షోరూమ్ ధర)గా నిర్ణయించారు. తాజా డిస్కౌంట్‌తో 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.8,749, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.10,749లకు లభిస్తుంది. దీనికి అదనంగా బ్యాంక్ డిస్కౌంట్ ప్లస్ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది.
పొకో ఎం5 ఫోన్ కొనుగోలుదారులకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కింద (వాటి పనితీరును బట్టి) రూ.10,100 రాయితీ అందిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి ఇన్స్టంట్ డిస్కౌంట్ రూ.750 లభిస్తుంది.
పొకో ఎం5 ఫోన్ 6.58-అంగుళాల ఫుల్ హెచ్డీ + ఐపీఎస్ ఎల్సీడీ (1080×2400 పిక్సెల్) డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. దీంతోపాటు కార్నింగ్ గొరిల్లా 3 ప్రొటెక్షన్ కూడా ఉంది. ఒక్టాకోర్ 6ఎన్ఎం మీడియా టెక్ హేలియో జీ99 ఎస్వోసీ చిప్ సెట్ ఉంటుంది.
పొకో ఎం5 ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2-మెగా పిక్సెల్ మాక్రో షూటర్, 26-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది.