న్యూఢిల్లీ, జూన్ 28: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ పోకో.. ఎఫ్ సిరీస్‌లో భాగం గా తాజాగా దేశీయ మార్కెట్లోకి ఎఫ్7 మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 7550 ఎంఏహెచ్ బ్యాటరీతో తయారైన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.29,999గా నిర్ణయించింది. 6.83 ఇంచుల 1.5కే అమోలెడ్ డిస్ప్లే, యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్, 24 జీబీ(12 జీబీ+12జీబీ) టర్బో ర్యామ్, స్నాప్‌డ్రాగన్-8ఎస్ జనరేషన్ 4, 90వాట్ల టర్బోచార్జింగ్, 22.5 వాట్ల రివర్స్ చార్జింగ్, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 కెమెరా, ముందుభాగంలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అల్ట్రా స్నాప్‌షాట్ మోడ్ వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది.
కేవలం ఈ ఫోన్ ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 1 నుంచి లభించనున్నది. 12జీబీ+ 256 జీబీ రకం ధర రూ. 29,999 గాను, 12జీబీ + 512 జీబీ మాడల్ రూ.31,999గా నిర్ణయించింది. హెచ్డీఎఫ్సీ, ఎస్బీ ఐ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో తొలిరోజు కొనుగోలు చేసిన వారికి రూ.2 వేల డిస్కౌంట్ కల్పిస్తున్నది. దీంతోపాటు ఎక్సేంజ్ బోనస్ కింద మరో రూ.2 వేలు లభించనున్నాయి. అలాగే ఏడాదిపాటు రూ.10 వేల విలువైన స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్, ఏడాదిపాటు వ్యారెంటీని ఉచితంగా అందిస్తున్నది. దీంతో ఈ ఫోన్‌పై వ్యారెంటీ రెండేండ్లు పొందవచ్చును.