Poco F5 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో.. తన ఎఫ్ సిరీస్ ‘పొకో ఎఫ్5 ప్రో 5జీ (Poco F5 Pro 5G) ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ ప్రాసెసర్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ ప్లే విత్ సపోర్ట్ ఫర్ డోల్బీ విజన్ టెక్నాలజీతో వస్తున్నది. ఈ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది. 5160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ సపోర్ట్ 67 వాట్ల వైర్డ్ టర్బో చార్జింగ్ అండ్ 30 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ తో వస్తుంది.
పొకో ఎఫ్5 ప్రో 5జీ (Poco F5 Pro 5G) ఫోన్ 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.36,000 (449 డాలర్లు) పలుకుతుంది. 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.41,000 (499 డాలర్లు), టాప్ ఎండ్ మోడల్ 12 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ సుమారుగా రూ.45 వేలు (549 డాలర్లు) పలుకుతుంది. గ్లోబల్ మార్కెట్లో ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఈ ఫోన్లు 429 డాలర్లు, 449 డాలర్లు, 499 డాలర్లకు లభిస్తాయి. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
ఈ ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు. అయితే, పొకో ఎఫ్5 5జీ ఫోన్ ఇప్పటికే భారత్ మార్కెట్లోకి వచ్చేసింది. 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 పలుకుతున్నది.
పొకో ఎఫ్5 5జీ ఫోన్లో మాదిరిగానే పొకో ఎఫ్5 ప్రో 5జీ ఫోన్లో కూడా సిమ్, సాఫ్ట్ వేర్, డిస్ ప్లే స్పెషిఫికేషన్లు ఉంటాయి. డ్యుయల్ (సిమ్) పొకో ఎఫ్5 ప్రో 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ 14 వర్షన్‌పై పని చేస్తుంది. 6.67-అంగుళాల డబ్ల్యూక్యూహెచ్ డీ + (1,440×3,200 పిక్సెల్స్) ఫ్లో అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నది. 240 హెర్జ్ట్ టచ్ శాంప్లింగ్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటది.
పొకో ఎఫ్5 5జీ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ తో వస్తున్నది. 64-మెగా పిక్సెల్ సెన్సర్, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ మాక్రో లెన్స్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీల కోసం 16-మెగా పిక్సెల్ కెమెరా సెన్సర్ ఉంటుంది. పొకో ఎఫ్5 5జీ ఫోన్ మాదిరిగానే కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి.