న్యూఢిల్లీ, జూలై 1: కనీస నగదు నిల్వలు లేని ఖాతాలపై జరిమానా చార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. మహిళలు, రైతులు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి,
బ్యాలెన్స్ నిర్వహణ జరిమానాలపై ఒత్తిడి లేకుండా బ్యాంకింగ్ సేవలను సులభంగా, మరింత సమగ్రంగా పొందేలా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో అశోక్ చంద్ర తెలిపారు.