ITR- CBDT | ప్రతిఏటా పన్ను చెల్లింపు దారులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తుంటారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25 అంచనా) ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే టైం వచ్చేసింది. సరైన అవగాహన లేకున్నా, నిపుణుల సాయం లేకున్నా ఐటీఆర్ ఫైల్ చేయడం కాసింత కష్టమే. కనుక చాలా మంది జాగ్రత్తగా ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తారు. అయితే ఐటీఆర్‌లో జరిగే తప్పులను సరిదిద్దుకునే సౌకర్యం ఉంటది. రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు ద్వారా సవరించుకోవచ్చు గానీ అందుకు ప్రత్యేకంగా టైం కేటాయించడం కొంత చికాకు పరిచే అంశం. కనుక తొలుత ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడే జాగ్రత్త వహిస్తే ఏ ఇబ్బందులూ ఉండవు. ఈ నేపథ్యంలో తప్పుల్లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందామా..!
పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేయడానికి వీలుగా ఇప్పటికే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఏడు రకాల ఐటీ ఫామ్స్ నోటిఫై చేసింది. పన్ను చెల్లింపుదారులు వీటిల్లో తమకు సరైన ఫామ్ అన్నది ఎంచుకుని ఫైల్ చేయాలి. రూ.50 లక్షల వరకూ వేతనం, ఒక ఇంటిపై ఆదాయం, వడ్డీ తదితర మార్గాల్లో వచ్చే ఆదాయంపై ఐటీఆర్-1 ఫైల్ చేయొచ్చు.
రూ.50 లక్షలపై చిలుకు ఆదాయం, ఒకే ఇంటి ద్వారా ఆదాయం ఉన్నవారు ఐటీఆర్-2 ఫైల్ చేయాలి. ఇక వృత్తి నిపుణులు ఐటీఆర్-1, ఐటీఆర్ -2 ఫామ్స్ విషయంలో ఐటీఆర్-3 సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో షేర్ల విక్రయాలు చేసే వారు తమ లావాదేవీల ఆధారంగా ఐటీఆర్-2 లేదా ఐటీఆర్3 ఫామ్ ఎంచుకోవాలి. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, రూ.50 లక్షల పై చిలుకు ఆదాయం గల సంస్థలు ఐటీఆర్-4 ఫామ్ ఎంచుకోవాలి. మిగతా పత్రాలు కంపెనీలు, వ్యాపర సంస్థలకు వర్తిస్తాయి. ఇక పన్ను చెల్లింపుదారులందరూ ఈ-ఫైలింగ్ లో ముందే తమ బ్యాంకు ఖాతా వివరాలు ధృవీకరించాలి. పన్ను చెల్లింపుదారుల ఖాతా యాక్టీవ్ గానే ఉందని ఇది నిర్ధారిస్తుంది. అప్పుడే ఐటీఆర్ రీఫండ్స్ క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. ఐటీఆర్ ఫైలింగ్ తర్వాత ఈ-వెరిఫై చేసుకోవాలి. అప్పుడే ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ పూర్తయినట్లు భావిస్తారు. ఐటీఆర్ అప్ లోడ్ చేసిన 30 రోజుల్లో దాన్ని వెరిఫై చేయాలి.
ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం వివిధ పెట్టుబడి పథకాల్లో రూ.1.50 లక్షల వరకూ మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. ఇందులోకి ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఇంటి రుణం అసలు, పిల్లల ట్యూషన్ ఫీజులు, జీవిత బీమా పాలసీలకు ప్రీమియం చెల్లింపులు కూడా ఈ సెక్షన్ కిందకే వస్తాయి.
ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియం వివరాలు తెలపాల్సి ఉంటుంది. సేవింగ్స్ ఖాతాలో జమ చేసిన మొత్తంపై వడ్డీరేటుకూ 80టీటీఏ సెక్షన్ కింద మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. వేతనంలో హెచ్ఆర్ఏ లేకుంటే అద్దె చెల్లింపులకు ఆదాయం 80జీజీ సెక్షన్ కింద మినహాయింపు క్లయిమ వాదిస్తున్నారు. ఇక గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసేయాలి. లేకపోతే రూ.1000 నుంచి రూ.5000 వరకూ ఫైన్ విధించాల్సి రావచ్చు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ కోసం జూలై 31తో గడువు ముగుస్తుంది. కనుక గడువు లోపే ఐటీఆర్ ఫైల్ చేయాలని ఆర్థిక నిపుణులుచెబుతున్నారు.