నాగపూర్, నవంబర్ 6 : ప్రముఖ పైపుల తయారీ సంస్థ ప్లాస్టో..తాజాగా టేబుల్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. పదేండ్ల వ్యారెంటీతో అన్బ్రేకబుల్ టేబుల్‌ను కొనుగోలుదారులకు అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నూతన టేబుల్ గృహాస్తులు, కమర్షియల్‌గా వినియోగించుకోవచ్చునని సూచించింది.
వీటితోపాటు టబ్స్, కుర్చీలు, బకెట్లు, టేబుల్స్, ట్యాప్స్తోపాటు మరిన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసినట్టు కంపెనీ పేర్కొంది. అలాగే కస్టమర్లకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్లాంట్‌కు సమీపంలోనే ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌ను తెరిచింది. ఈ అవుట్‌లెట్‌లో అన్ని ఉత్పత్తులపై భారీ రాయితీని ఇస్తున్నది.