Google Pixel7a | గూగుల్ స్మార్ట్ ఫోన్ ‘పిక్సెల్ 7ఏ’ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తున్నది. వచ్చే నెల పదో తేదీన ‘పిక్సెల్7ఏ’ ఫోన్ మార్కెట్లోకి రానున్నది. గూగుల్ వార్షిక సమావేశం సందర్భంగా ఈ ఫోన్ ఆవిష్కరిస్తారని సమాచారం. 5జీ సేవలు అందించే ఈ ఫోన్ ధర రూ.37,100 నుంచి రూ.41,200 (400-500 అమెరికా డాలర్లు) ఉండవచ్చునని తెలుస్తున్నది. మెరుగైన బ్యాటరీ సపోర్ట్, బెటర్ రేర్ కెమెరా, 90 హెర్ట్ డిస్ప్లేతో వస్తుందని సమాచారం.
పిక్సెల్ 6ఏతో పోలిస్తే కొంచెం మెరుగ్గా 4410 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 6.1 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ విత్ ఎఫ్‌హెచ్‌డీ + రిజొల్యూషన్ సపోర్ట్స్ 90 హెర్ట్ @ రీఫ్రెష్ రేట్ ఉంటుందని తెలుస్తున్నది.64-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్787 పైమరీ సెన్సర్‌తోపాటు ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది.
దీంతోపాటు 12 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ సోనీ ఐఎంఎక్స్712 కెమెరా కూడా వస్తుంది. ఈ ఫోన్ ఆర్కిటిక్ బ్లూ, కార్బన్, కాటన్, జేడ్ కలర్ వేరియంట్లలో లభిస్తుందని సమాచారం.భారత్‌లో పోటీ దృష్ట్యా.. అమెరికా ధరలతో పోలిస్తే భారత్‌లో పిక్సెల్ 7ఏ ఫోన్ ధర రూ.50 వేల లోపే ఉండొచ్చునని సమాచారం. ఒకవేళ అమెరికాలో ధర పెరిగితే.. భారత్‌లోనూ ధర పెంచవచ్చు.