న్యూఢిల్లీ, జూన్ 6: ఫీచర్ ఫోన్లలోనూ యూపీఐ పేమెంట్ సేవలు అందించడానికి ఫోన్‌పే..తాజాగా జీఎస్‌పే ఐటీని కొనుగోలు చేసింది. ఈ నూతన టెక్నాలజీతో ఫీచర్ ఫోన్లలోనూ యూపీఐ ఆధారిత పేమెంట్ చెల్లింపులు జరుపుకోవడానికి వీలుంటుంది.
వచ్చే త్రైమాసికాల్లో అందుబాటులోకి రానున్న నూతన ఫీచర్ ఫోన్లలో ఈ యూపీఐ పేమెంట్ యాప్‌ను పొందుపరచనున్నట్టు పేర్కొంది.