బెంగళూరు, ఆగస్టు 30: ప్రముఖ ఫిన్‌టెక్ సేవల సంస్థ ఫోన్‌పే..తాజాగా స్టాక్ బ్రోకింగ్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. మార్కెట్ ప్లాట్ఫామ్లో సేవలు అందించేందుకుగాను ‘షేర్. మార్కెట్’ పేరుతో నూతన సేవలను బుధవారం ఆరంభించింది. ఈ నూతన వెంచర్‌కు ఉజ్వల్ జైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా వ్యవహరించనున్నారు. స్టాక్ బ్రోకింగ్ సెగ్మెంట్లోకి ప్రవేశించడంతో పూర్తిస్థాయి ఆర్థిక సేవలు అందించిన సంస్థగా నిలిచిపోనున్నట్లు ఫోన్‌పే సీఈవో సమీర్ నిగం తెలిపారు. వాల్‌మార్ట్‌కు చెందిన ఈ సంస్థ.. షేర్ మార్కెట్‌తో స్టాక్స్, ఈటీఎఫ్ సేవలు అందించనున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఫ్యూచర్, ఇతర మార్కెట్లోకి కూడా ప్రవేశించే అవకాశం కూడా ఉందన్నారు. ఈ నూతన బ్రాండ్‌ను బీఎస్ఈ ఎండీ, సుందరరామన్ రామమూర్తి ఆవిష్కరించారు.