న్యూఢిల్లీ, మే 30: ఫోన్‌పే కస్టమర్లు ఇకపై వివిధ రకాల రుణాలనూ పొందవచ్చు. గృహ, ఆటో, విద్యా, బంగారం, మ్యూచువల్ ఫండ్ లోన్లను అందిస్తున్నట్టు గురువారం సంస్థ ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పర్చుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం 15 సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, మరికొద్ది రోజుల్లో మరో 10 సంస్థలూ కలుస్తాయని చెప్పింది.