న్యూఢిల్లీ, జూలై 11: సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే సమీక్షించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను శుక్రవారం ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) కోరింది. ఓఎన్డీఎల్ఎస్ పోర్టల్ ద్వారా ప్రత్యేకంగా ఆన్లైన్లో సర్టిఫికెట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ (సీవోపీపీ) దరఖాస్తుల సమర్పణను సీడీఎస్‌సీవో తప్పనిసరి చేస్తూ సదరు సర్క్యులర్ విడుదలైంది.
ఈ నేపథ్యంలోనే ఫార్మెక్సిల్ పైవిధంగా విజ్ఞప్తి చేసింది. ఎగుమతుల్లో గట్టిగానే సమస్యలు తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఎగుమతులు ఆలస్య మైతే అంతర్జాతీయ మార్కెట్లో కస్టమర్లు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటారని ఫార్మెక్సిల్ డీజీ కే రాజా భాను వివరించారు.