హైదరాబాద్, జూన్ 5: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్..అంతర్జాతీయ బయోటెక్ సంస్థ ఆల్వోటెక్తో జట్టుకట్టింది. క్యాన్సర్ చికిత్స కోసం బయోసిమిలర్ ఔషధం కేట్రూడాను అంతర్జాతీయ మార్కెట్కు అభివృద్ధి చేయడానికి ఇరు సంస్థలు కలిసిపనిచేయనున్నాయి.
2024లో ప్రపంచవ్యాప్తంగా కేట్రూడా 29.5 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిగాయి. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ బయోసిమిలర్ ఔషధాన్ని అభివృద్ధి చేయడంతోపాటు ఉత్పత్తి కూడా చేయనున్నారు.