న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా జరిపే చెల్లింపులను పలికే సౌండ్‌బాక్స్ పరికరాన్ని ప్రవేశపెట్టిన పేటీఎం సోమవారం ‘కార్డ్ సౌండ్‌బాక్స్’ను విడుదల చేసింది. దీంతో వ్యాపారులు మొబైల్‌తో పాటు క్రెడిట్, డెబిట్ కార్డుల చెల్లింపులను తీసుకోవచ్చని పేటీఎం తెలిపింది. ‘టాప్ అండ్ పే’ ఫీచర్ ద్వారా రూ. 5,000 వరకూ కార్డ్ చెల్లింపుల్ని వ్యాపారులు పొందవచ్చన్నది. వినియోగదారులు వీసా, మాస్టర్‌కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, రూపే నెట్వర్క్స్ కలిగిన కార్డు చెల్లింపులు చేయవచ్చు. అలాగే టాప్ ఫీచర్ ద్వారా యూజర్లు వారి స్మార్ట్ ఫోన్లతో సైతం చెల్లించవచ్చు. ఈ డివైస్ 4జీ నెట్వర్క్ కనెక్టివిటీ ద్వారా పనిచేస్తుందని, పూర్తిగా చార్జ్చేసిన బ్యాటరీ లైఫ్ ఐదు రోజులపాటు ఉంటుందని పేటీఎం వివరించింది. 11 భాషల్లో ఎలర్ట్స్ అందిస్తుంది.