న్యూఢిల్లీ, జూలై 15 : ప్యాసింజర్ వాహన విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 12,73,811 యూనిట్ల అమ్మకాలు జరిగాయని దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) తాజాగా వెల్లడించింది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ప్రతికూలతలు ఉన్నప్పటికీ దేశీయంగా డిమాండ్ అధికంగా ఉండటం వల్లనే అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని పేర్కొంది.