ఏటా 500 ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని అమెరికాకు చెందిన పారెక్సల్ ఇక్కడి సిబ్బందిని భారీగా పెంచుకోబోతున్నది. ప్రతియేటా 300 నుంచి 500 మంది వరకు సిబ్బందిని వచ్చే ఐదేండ్ల వరకు రిక్రూట్ చేసుకోనున్నట్టు పారెక్సల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ వ్యాస్ తెలిపారు.
- పారెక్సల్ ఇండియా ఎండీ సంజయ్ వ్యాస్
హైదరాబాద్, అక్టోబర్ 13: దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని అమెరికాకు చెందిన పారెక్సల్ ఇక్కడి సిబ్బందిని భారీగా పెంచుకోబోతున్నది. ప్రతియేటా 300 నుంచి 500 మంది వరకు సిబ్బందిని వచ్చే ఐదేండ్ల వరకు రిక్రూట్ చేసుకోనున్నట్టు పారెక్సల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ వ్యాస్ తెలిపారు. ప్రస్తుతం సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్లలో 6 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, 2028 నాటికి ఈ సంఖ్యను 8 వేలకు చేరుకోనున్నది. హైదరాబాద్‌లో ఉన్న సెంటర్లో 2,400 మంది విధులు నిర్వహిస్తుండగా, ఈ వారంలో మరో 100 మందిని నియమించుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.రాష్ట్రంలో ఫార్మా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్నట్టు చెప్పారు.
మరోవైపు, వచ్చే ఏడాది హైదరాబాద్‌లో జరగనున్న బయోఏషియా సదస్సులో క్లినికల్ ట్రయల్స్‌పై ప్రత్యేక కార్యాక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఒకవేళ వచ్చే సదస్సులో క్లినికల్ ట్రయల్స్‌పై సదస్సు ఏర్పాటు చేస్తే పారెక్సల్ నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో క్లినికల్ ట్రయల్ పరిశ్రమ 2.5 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నదని, ప్రతియేటా రెండంకెల వృద్ధితో 2028 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఫార్మా సిటీలో ఏర్పాటు చేసిన సెంటర్లో తమ పరిశోధనలు జరిపించుకోవడానికి 500 కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

