న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పానసోనిక్ ఒకేసారి దేశీయ మార్కెట్లోకి 60 మాడళ్లను విడుదల చేసింది. వీటిలో అత్యధికంగా ఇన్వర్టర్ ఏసీలేనని పేర్కొంది. వచ్చేది వేసవికాలం కావడంతో ఈసారి ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందన్న అంచనాలను వాతావరణ శాఖ విడుదల చేయడంతో ఏసీల తయారీ సంస్థలు నూతన మాడళ్లను విడుదల చేయడానికి సిద్ధమయ్యా యి. ఐవోటీ ప్లాట్‌ఫాంపై విడుదల చేసిన ఈ ఏసీలు కొన్ని సెకండ్లలోనే సెటప్ చేసుకోవచ్చును. ముఖ్యంగా కస్టమర్లు తమ నెట్వర్క్, స్మార్ట్ స్పీకర్లతో కనెక్ట్ చేసుకోవచ్చును కూడా.