ఇస్లామాబాద్: ఫారెక్స్ మార్కెట్లో పాకిస్థాన్ రూపాయి పతనం కొనసాగుతున్నది. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పాకిస్థాన్ రూపీ బలహీనపడుతూ వస్తున్నది. ఇవాళ్టి ట్రేడింగ్ ప్రారంభంలో అమెరికన్ డాలర్‌తో పోల్చితే అత్యంత గరిష్టంగా 174.30 స్థాయికి పడిపోయిన పాకిస్థాన్ రూపాయి.. చివరి 34 పైసలు మెరుగుపడి 173.96 వద్ద స్థిరపడింది. గత మంగళవారం పాకిస్థాన్ రూపీ 173.47 పైసల వద్ద ముగిసింది. ఇవాళ మరో 49 పైసలు కోల్పోయి 173.96 పైసలకు పతనమైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది.