దేశీ కంపెనీల్లోనూ లేఆఫ్స్ ప్రకంపనలు..టెకీల్లో గుబులు!
భారత్‌కు చెందిన బడ్జెట్ హోటల్ చైన్ ఓయో ప్రోడక్ట్, ఇంజనీరింగ్ టీమ్స్‌లో 600 మంది ఉద్యోగులను తొలగించనుంది. ప్రాజెక్టులను మూసివేసి ఆయా టీంలను విలీనం చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది.
న్యూఢిల్లీ : బహుళజాతి టెక్ దిగ్గజాలు ఎడాపెడా లేఆఫ్స్‌కు తెగబడుతుండగా తాజాగా దేశీ కంపెనీలు ఒకదాని వెంట మరొకటి లేఆఫ్స్‌ను ప్రకటిస్తున్నాయి. భారత్‌కు చెందిన బడ్జెట్ హోటల్ చైన్ ఓయో ప్రోడక్ట్, ఇంజనీరింగ్ టీమ్స్‌లో 600 మంది ఉద్యోగులను తొలగించనుంది. ప్రాజెక్టులను మూసివేసి ఆయా టీంలను విలీనం చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. అయితే ఇదే సమయంలో సేల్స్ టీంలో 250 మంది ఉద్యోగులను నియమించుకుంటామని ఓయో తెలిపింది.
ఇక షేర్‌చాట్ తర్వాత నవంబర్-డిసెంబర్లో లేఆఫ్స్‌ను ప్రకటించిన దేశీ కంపెనీ ఓయో కావడం గమనార్హం. లేఆఫ్స్‌కు గురైన ఉద్యోగులను ఏఐ ఆధారిత ప్రైసింగ్, ఆర్డరింగ్, పేమెంట్స్ విభాగాల్లో అవకాశాలు కల్పించేందుకు యోచిస్తున్నామని ఓయో తెలిపింది. తాము తొలగించే ఉద్యోగులకు వేరే కంపెనీల్లో ఉద్యోగాలు లభించేలా చూస్తామని ఓయో వ్యవస్ధాపక సీఈఓ రితేష్ అగర్వాల్ చెప్పారు.
ఓయోకు విస్తృతంగా సేవలందించిన ఈ ఉద్యోగులను వదులుకోవాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. ఓయో ఎదుగుదలతో పాటు రాబోయే రోజుల్లో వీరి సేవలు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఓయో 2020లోనూ దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించగా రెండో దశలో తాజా లేఆఫ్స్‌ను ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- layoffs
- oyo
- technology team
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

