న్యూఢిల్లీ : భారత్‌లో ఒప్పో రెనో 7 సిరీస్ జనవరిలో లాంఛ్ అవుతుందని భావిస్తున్నారు. జనవరి సంక్రాంతి సీజన్లో భారత్‌లో ఒప్పో రెనో 7 సిరీస్ లాంఛ్ ఉంటుందని 91మొబైల్స్ నివేదిక వెల్లడించింది. రెనో 7 సిరీస్‌లో భాగంగా రెనో 7, రెనో 7 ప్రొ, రెనో 7ప్రొ+ పేరిట మూడు స్మార్ట్ఫోన్లను ఒప్పో లాంఛ్ చేస్తుందని తెలిపింది. మరోవైపు రెనో 7ప్రొ+ స్ధానంలో రెనో 7ఎస్ఈని ప్రవేశపెడుతుందని మరికొన్ని లీక్‌లు వెల్లడయ్యాయి.
ఇక ఒప్పో మొత్తం నాలుగు మోడల్స్ మీద కసరత్తు సాగిస్తోందనే ఊహాగానాలూ సాగుతున్నాయి. ఇక ఒప్పో రెనో 7 ధర మోడల్‌ను బట్టి రూ 41,000 నుంచి రూ 46,800 వరకూ ఉండనుంది. ఇక ఒప్పో రెనో 7 ప్రొ రూ 50,300 నుంచి రూ 56,200 వరకూ పలుకుతుందని అంచనా. మరోవైపు రెనో 7+ మోడల్ రూ 62,000 వరకూ ఉంటుందని చెబుతున్నారు.