Oppo Reno 11 Series | 11న భారత్ మార్కెట్లోకి ఒప్పో రెనో11 సిరీస్ ఫోన్లు.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Oppo Reno 11 Series | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో రెనో11 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో వచ్చేనెల 11న ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది.
Oppo Reno 11 Series | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో రెనో11 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే చైనా మార్కెట్లో ఆవిష్కరించిన ఒప్పో రెనో11 (Oppo Reno11), ఒప్పో రెనో11 ప్రో (Oppo Reno11 Pro) వచ్చేనెల 11న భారత్ మార్కెట్లోకి రానున్నాయి.
ఒప్పో రెనో11, ఒప్పో రెనో11 ప్రో ఫోన్లు రెండూ కలర్ఓఎస్14 వర్షన్ మీద పని చేస్తాయి. రెండింటిలోనూ సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా ఉంటుంది. ఒప్పో రెనో11 ఫోన్ 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఒప్పో రెనో11 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఓలెడ్ డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 8200 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ట్రిపుల్ రేర్ కెమెరా విత్ 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 600 సెన్సర్ కెమెరా సెటప్ ఉంటుంది.
ఒప్పో రెనో11 ప్రో ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.74 అంగుళాల డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్, సోనీ ఐఎంఎక్స్890 – 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, రెనో11 ప్రో ఫోన్ 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4700 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Illegal Egg Donation | ఒక్కో అండం రూ. 3 లక్షలు..! డబ్బు ఆశ చూపి వ్యాపారం.. హాస్టళ్ల ముసుగులో దందా
Narsingi Big Road | ఒక్క బిల్డర్ కోసం మాపై బుల్డోజరా?.. ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ‘బిగ్’ రోడ్ బాధితులు
IDBI Bank | అగ్గువకు ఐడీబీఐ..! నిరుడు బ్యాంక్ లాభం 10 వేల కోట్లు
Vote Theft | ప్రపంచ దేశాల నోట.. ఓటు చోరీ మాట.. పలు దేశాల్లో కొనసాగుతున్న వివాదం
Harish Rao | కేసీఆర్‌ది భూ రక్షణ.. రేవంత్‌ది భూ భక్షణ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

