Oppo Reno 10 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ప్రీమియం ఒప్పో రెనో 10 ప్రో 5జీ ఫోన్ ధర తగ్గించింది. త్వరలో ఒప్పో రెనో11 సిరీస్ ఫోన్లు మార్కెట్లో ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఒప్పో రెనో 10 ప్రో 5జీ ఫోన్‌పై రూ.2000 ధర తగ్గించింది. గత జూలైలో ఒప్పో రెనో10 5జీ, ఒప్పో రెనో10 ప్రో+ 5జీ ఫోన్లను ఆవిష్కరించింది. ఒప్పో రెనో 10 5జీ సిరీస్ ఫోన్లు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓలెడ్ 3డీ కర్వ్డ్ డిస్ ప్లే తో వచ్చాయి. ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 778జీ 5జీ ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో మార్కెట్లోకి వచ్చింది. 80 వాట్ల సూపర్ వూక్ ఫ్లాష్ చార్జింగ్ మద్దతుతో 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో అందుబాటులో ఉంది.
ఒప్పో రెనో10 ప్రో 5జీ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.39,999తో ఆవిష్కరించింది. ప్రస్తుతం రూ.2000 తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టయింది. రిలయన్స్, క్రోమా ఈ-కామర్స్ వెబ్ సైట్లలోనూ లభ్యం అవుతుంది. గ్లోసీ పర్పుల్, సిల్వరీ గ్రే షేడ్ కలర్స్‌లో లభిస్తుంది.
ఒప్పో రెనో 10 ప్రో 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ కలర్ ఓఎస్ 13.1 వర్షన్‌పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్డీఆర్ + మద్దతుతో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2412 పిక్సెల్స్) ఓలెడ్ 3డీ కర్వ్డ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది.
50-మెగా పిక్సెల్ ప్రైమరీ సోనీ ఐఎంఎక్స్890 సెన్సర్ విత్ ఓఐఎస్, 32 మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్సర్, 8-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ గల ఈ ఫోన్ అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కలిగి ఉంటుంది.