న్యూఢిల్లీ, మార్చి 20: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో..దేశీయ మార్కెట్లోకి మరో సిరీస్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎఫ్29 సిరీస్లో భాగంగా రెండు మాడళ్లను ప్రవేశపెట్టింది. వీటిలో రూ.23,999 ధర కలిగిన ఒప్పో ఎఫ్29 ఫోన్ ఈ నెల 27 నుంచి అందుబాటులోకి రానుండగా, రూ.27,999 విలువైన ఎఫ్29 ప్రో మాడల్ ఏప్రిల్ 1 నుంచి మార్కెట్లో విడుదలకానున్నది. ఐపీ66, ఐపీ68, ఐపీ68 ప్రమాణాలకు తగ్గట్టుగా రూపొందించిన ఈ ఫోన్ నీటిలో పడిన.. దుమ్ములో ఎంతసేపైన ఉన్నా, అధిక వేడిలో ఉంచినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 6500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ రివర్స్ చార్జింగ్ సదుపాయం కూడా వున్నది.