Oppo K12x 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ కొత్తగా ఫీథర్ పింక్ కలర్ ఆప్షన్లో మార్కెట్లో ఆవిష్కరించింది. ఇంతకుముందు రెండు నెలల క్రితమే భారత్ మార్కెట్లో ఈ ఫోన్ ఎంటరైంది. తాజాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 సందర్భంగా ఫీథర్ పింక్ కలర్ ఆప్షన్‌తో వస్తున్నది. ఈ నెల 26 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్ పై పని చేస్తుంది. మిలిటరీ -గ్రేడ్ ఎంఐఎల్ ఎస్టీడీ-810హెచ్ డ్యూరబిలిటీ ఉంటుంది.
ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.12,999 పలుకుతుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా (సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6) వరకు రూ.2000 డిస్కౌంట్ ధరతో రూ.10,999లకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ ప్లస్ కస్టమర్లు ఈ నెల 26 నుంచే ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. జూలైలో ఆవిష్కరించిన ఒప్పో కే12ఎక్స్ 5జీ ఫోన్ బ్రీజ్ బ్లూ, మిడ్ నైట్ వయోలెట్ రంగుల్లో లభిస్తుంది.
ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ వర్షన్‌పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల హెచ్డీ+ (720×1604 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వరకూ కలిగి ఉంటాయి. 32-మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరాతోపాటు 2-మెగా పిక్సెల్ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 45 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.