Oppo F27 Pro+ 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ఒప్పో ఎఫ్27 ప్రో+ 5జీ (Oppo F27 Pro+ 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఒక్టాకోర్ మీడియాటెక్ 7050 ఎస్వోసీ చిప్ సెట్, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీతోపాటు 64-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల 3డీ కర్వుడ్ (2400×1080 పిక్సెల్స్ రిజొల్యూషన్) అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 950 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తో వస్తోంది.
2.6 గిగా హెర్ట్జ్ ఒక్టాకోర్ మీడియాటెక్ 7050 ఎస్వోసీ ప్రాసెసర్‌తో ఒప్పో ఎఫ్27 ప్రో+ ఫోన్ వస్తోంది. 67వాట్ల సూపర్ వూక్ ఫ్లాస్ చార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 20 నిమిషాల్లో 56 శాతం, 44 నిమిషాల్లో 100 శాతం ఫోన్ చార్జింగ్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్.
ఒప్పో ఎఫ్27ప్రో+ ఫోన్ 64-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా. 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరాతోపాటు మరో కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. హై ప్రెషర్, హై టెంపరేచర్, వాటర్ జెట్స్ తోపాటు 30 నిమిషాల వరకూ నీటిలో ముగినిపోయినా దెబ్బ తినకుండా ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ అందుకున్న తొలి ఫోన్ ఇది అని ఒప్పో తెలిపింది. స్మూల్ మల్టీ టాస్కింగ్, ఎఫిషియెంట్ పవర్ మేనేజ్ మెంట్ కోసం ఒక్టాకోర్ మీడియాటెక్ 7050 ప్రాసెసర్ పని చేస్తుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ చార్జింగ్ .. వివిధ కార్యక్రమాల కోసం వినియోగించడానికి వెసులుబాటుగా ఉంటుంది. ఒప్పో ఎఫ్27ప్రో + ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.27,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.29,999లకు లభిస్తాయి.
ఈ నెల 13 నుంచి 19 వరకూ ప్రీ ఆర్డర్ బుక్ చేసుకున్న వారికి పలు డీల్స్ అందిస్తోంది ఒప్పో. యాక్సిడెంటల్, లిక్విడ్ డ్యామేజీపై ఆరు నెలల వరకూ రూ.1,199 ప్రొటెక్షన్ ఉంటుంది. ఆరు నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ, తొమ్మిది నెలల వరకూ డౌన్ పేమెంట్ లేకుండా కొనుగోలు చేయొచ్చు. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.1000 చెల్లిస్తారు. ఒప్పో ఫోన్ యూజర్లకు అదనంగా రూ.1000 లాయాల్టీ బోనస్ లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ఈ నెల 20 నుంచి రెండు రంగులు -డస్క్ పింక్, మిడ్ నైట్ నేవీ రంగుల్లో లభిస్తుంది.