Oppo F27 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో ఎఫ్27 5జీ (Oppo F27 5G) ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరా విత్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని సమాచారం. రెండు ర్యామ్ అండ్ రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుందని భావిస్తున్నారు.
ఒప్పో ఎఫ్27 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.22,999, టాప్ హై ఎండ్ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999లకు లభిస్తుందని సమాచారం. అంబర్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో రానున్నది. సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై రూ.1800 వరకూ ఇన్ స్టంట్ క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ఆరు నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. వన్ టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్ మెంట్ ఆఫర్ కూడా అందిస్తోంది.
ఒప్పో ఎఫ్27 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ + ఓలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 2100 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో ఈ ఫోన్ పని చేస్తుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుందని భావిస్తున్నారు. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ పోర్ట్రైట్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. ఏఐ స్టూడియో, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0 వంటి ఏఐ బ్యాక్డ్ ఫీచర్లు ఉంటాయి. 45వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని సమాచారం.