Oppo F23 Pro 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. త్వరలో భారత్ మార్కెట్లోకి ఒప్పో ఎఫ్23 ప్రో 5జీ (Oppo F23 Pro 5G) ఫోన్ ఆవిష్కరించనున్నది. గత ఏడాది ఏప్రిల్‌లో మార్కెట్లోకి వచ్చిన ఎఫ్ సిరీస్ ఫోన్ `ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ` ఫోన్‌కు కొనసాగింపుగా ఒప్పో ఎఫ్23 ప్రో 5జీ ఫోన్ వస్తున్నది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ ధరలో అందుబాటులో ఉండొచ్చునని భావిస్తున్నారు. మీడియాలో వచ్చిన వార్తా కథనాల ప్రకారం వచ్చేనెల 15న దేశీయ మార్కెట్లో ఆవిష్కరించవచ్చు. దీని ధర రూ.25 వేల నుంచి రూ.26 వేల మధ్య ఉండొచ్చునని అంచనా.
6.4 లేదా 6.72-అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ / ఎల్సీడీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12-బేస్డ్ కలర్ ఓఎస్ 12 యూఐ వర్షన్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ చిప్ సెట్ వస్తుందని సమాచారం. 4500 (5000) ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ బ్రైట్నెస్ 580 నిట్స్ ఉంటుందని అంచనా. ఇంతకుముందు వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ చిప్సెట్ వినియోగించారు.
ఒప్పో ఎఫ్23 ప్రో 5జీ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరాతో వస్తుందని సమాచారం. అందులో 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, రెండు 2-మెగా పిక్సెల్ సెన్సర్లు, 40 ఎక్స్ మైక్రోస్కోప్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో రికార్డింగ్ కోసం ఫ్రంట్‌లో 32-మెగా పిక్సెల్ సెన్సర్‌తో వస్తుందని భావిస్తున్నారు.
ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ.. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.31,999. ఈ ఫోన్ కాస్మిక్ బ్లాక్, రెయిన్బో స్పెక్ట్రం కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. నోటిఫికేషన్ అలర్ట్స్కోసం బ్యాక్ ప్యానెల్‌పై డ్యుయల్ ఆర్బిట్ లైట్స్ ఉంటాయి.