Oppo A3x 4G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ తీసుకొచ్చింది. ఒప్పో (Oppo) తన ఒప్పో ఏ3ఎక్స్ 4జీ (Oppo A3x 4G) ఫోన్ క్వాల్కామ్ ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 1 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఒప్పో ఏ3ఎక్స్ 4జీ ఫోన్ 8-మెగా పిక్సెల్ రేర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ కెమెరా, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,999, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999లకు లభ్యం అవుతుంది.
ఒప్పో ఏ3ఎక్స్ 4జీ (Oppo A3x 4G) ఫోన్ 100 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. 8-మెగా పిక్సెల్ రేర్ కెమెరా విత్ 78 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 5-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా వాటర్ డ్రాప్ స్టైల్ కటౌట్ విత్ 78 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఫోన్ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ కనెక్టివిటీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ పోర్ట్ ఉంటాయి. ఈ-కంపాస్, ప్రాగ్జిమిటీ సెన్సర్, యాక్సెలరో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్ ఉంటాయి. సెక్యూరిటీ, బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.