Oppo A3 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo).. తన బడ్జెట్ ఫ్రెండ్లీ.. ఒప్పో ఏ3 5జీ (Oppo A3 5G) ఫోన్ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (MediaTek Dimensity 6300) ప్రాసెసర్ విత్ 6జీబీ ర్యామ్ వస్తోంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తోపాటు 6.67 అంగుళాల (720×1604 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్ బాక్స్ బేస్డ్ కలర్ ఓఎస్ 14.0.1 వర్షన్ పై పని చేస్తుంది. 45వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
ఒప్పో ఏ3 5జీ (Oppo A3 5G) ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999లకు లభిస్తుంది. నెబులా రెడ్, ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, వన్ కార్డ్, ఎస్బీఐ కార్డులతో కొనుగోలు చేసే వారికి పది శాతం నుంచి రూ.1600 వరకూ డిస్కౌంట్ అందిస్తుంది. మొబిక్విక్ వాలెట్ యూజర్లు అదనంగా రూ.500 క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందుతారు.
ఒప్పో ఏ3 5జీ (Oppo A3 5G) ఫోన్ 50-మెగా పిక్సెల్స్ రేర్ కెమెరా విత్ 76 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ కెమెరా విత్ 78 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంటాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, జీపీఎస్ , యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ కనెక్టివిటీ ఉంటది. అంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, యాక్సెలరో మీటర్, గైరోస్కోప్, ఈ-కంపాస్ తదితర సెన్సర్లు ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.