ChatGPT – WhatsApp | మైక్రోసాఫ్ట్ మద్దతుతో పని చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఓపెన్ ఏఐ.. కొత్తగా తన ఏఐ చాట్ బోట్ చాట్‌జీపీటీని వాట్సాప్‌లో అందుబాటులోకి తెచ్చింది. ‘12డేస్ ఆప్ ఓపెన్ ఏఐ’ అనౌన్స్మెంట్స్లో భాగంగా వాట్సాప్ యూజర్లకు చాట్‌జీపీటీ సేవలు లభిస్తాయి. మరో యాప్, ఖాతా లేకుండానే నేరుగా వాట్సాప్‌లోనే చాట్‌జీపీటీ వాడుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ యూజర్లందరికీ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. +18002428478 ఫోన్ నంబర్‌తో వాట్సాప్‌లో చాటింగ్ చేయొచ్చు. అయితే, ప్రస్తుతానికి ఈ సేవలు అమెరికా, కెనడా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మున్ముందు మనం అడిగిన ప్రశ్నలకు చాట్‌జీపీటీ జవాబులు ఇస్తుంది. భారత్ లోనూ త్వరలో చాట్‌జీపీటీ సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఇప్పుడు చాట్‌జీపీటీ సేవలు పొందాలంటే ప్రత్యేకంగా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. కానీ వాట్సాప్ లో ప్రత్యేకంగా అకౌంట్ అవసరం లేదు కానీ రోజువారీగా వాడకంపై లిమిట్ ఉంటుంది. లిమిట్ దగ్గర పడుతుండగానే నోటిఫికేషన్ వస్తుంది. మున్ముందు చాట్‌జీపీటీ సెర్చ్, ఇమేజ్ బేస్డ్ ఇంటరాక్షన్, కన్వర్జేషన్ మెమరీ లాగ్స్ వంటి వసతులు వస్తాయి. ఇప్పటికే మెటా తన వాట్సాప్‌లో ఏఐ చాట్ బోట్ సేవలు అందిస్తున్నది. మరింత మందికి చేరువయ్యేందుకు ఓపెన్ ఏఐ తన చాట్‌జీపీటీ సేవలను వాట్సాప్‌లో అందుబాటులోకి తెస్తోంది.