ChatGPT Enterprise | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్‌బోట్ చాట్‌జీపీటీ (ChatGPT)దే ఇప్పుడు హవా.. నిత్యం లక్షల మంది యూజర్లు చాట్‌జీపీటీ సేవలు పొందుతున్నారు. అటు వ్యక్తిగతం.. ఇటు ప్రొఫెషనల్ విధుల్లోనూ దీని భాగస్వామ్యం తప్పనిసరైంది. తాజాగా ఓపెన్ ఏఐ.. వ్యాపారుల కోసం ప్రత్యేకంగా చాట్‌జీపీటీ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు మోస్ట్ పవర్ఫుల్ వర్షన్ చాట్‌జీపీటీ ఎంటర్ప్రైజ్ (ChatGPT Enterprise) పేరిట కొత్త వర్షన్ ప్రారంభించామని వెల్లడించింది.
చాట్‌జీపీటీ ప్రస్తుతం వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా పలు సేవలందిస్తూ.. పలువురు తమ డేటా సేఫ్టీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త వర్షన్ చాట్‌జీపీటీ ఎంటర్ప్రైజెస్ తెచ్చామని ఓపెన్ ఏఐ తెలిపింది. వ్యాపారుల వ్యక్తిగత గోప్యత, వారి డేటాకు భద్రత కల్పించడానికి ఈ చాట్‌బోట్ ఉపకరిస్తుందని వెల్లడించింది. క్రియేటివ్‌గా మెరుగైన ఫలితాలు అందించడంతోపాటు ఉద్యోగులకు అన్ని విధాల తోడుగా ఉంటుందని తెలిపింది. చాట్‌జీపీటీ ఎంటర్ ప్రైజ్ తక్షణం వినియోగంలోకి వస్తుందని వెల్లడించింది. ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే తమ యూజర్ల సంఖ్య పడిపోవడంతో మెరుగైన భద్రతా ఫీచర్లతో వ్యాపారులకు చాట్‌జీపీటీ ఎంటర్ప్రైజ్ చాట్‌బోట్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తున్నది.