హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : చాట్ జీపీటీని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన ఓపెన్ ఏఐ అకాడమీ, హైదరాబాద్‌కు చెందిన నెక్స్‌వేవ్ సంస్థలు జనరేటివ్ ఏఐ బిల్ట్థాన్ను నిర్వహించబోతున్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద జనరేటివ్ ఏఐ ఇన్నోవేషన్ చాలెంజ్.
దేశంలోని ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడమే ఈ బిల్డథాన్ ముఖ్య ఉద్దేశం. హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ రిటైల్, అగ్రికల్చర్, సస్టెనబిలిటీ రంగాల్లో కీలక సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు స్టేజ్లలో ఎంపిక జరుగుతుందని నెక్ట్స్‌వేవ్ విజేతలకు రూ.10 లక్షల వరకు బహుమతిగా అందజేస్తామన్నారు.