OnePlus Pad Go | ప్రముఖ చైనా టెక్ కంపెనీ ‘వన్ ప్లస్ (OnePlus)` ఈ నెల ఆరో తేదీన ‘వన్ ప్లస్ ప్యాడ్ గో (One Plus Pad Go)` టాబ్లెట్‌ను. భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. 2.4 కే రిజొల్యూషన్‌తో 11.35 అంగుళాల వన్ ప్లస్ పాడ్ గో టాబ్లెట్ ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. అంతకు మించి టాబ్లెట్‌లోని స్పెషిఫికేషన్స్, ఫీచర్లు బయట పెట్టలేదు. ట్విన్ మింట్ కలర్లో లభిస్తుందని భావిస్తున్నారు.దీని ధర రూ.25,999 ఉంటుందని తెలుస్తున్నది.
ఇంతకుముందు ఐదు నెలల క్రితం ఆవిష్కరించిన వన్ ప్లస్ ప్యాడ్’ టాబ్లెట్‌లో మీడియాటెక్ డైమెన్షన్ 9000 ప్రాసెసర్ వినియోగించారు. ఈ సారి మీడియా టెక్ హెలియో జీ99 ప్రాసెసర్ వాడే అవకాశాలు ఉన్నాయి.
కొత్త టాబ్లెట్‌లో సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ కెమెరాతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ తోపాటు 8-మెగా పిక్సెల్ రేర్ కెమెరా ఉంటుందని తెలుస్తున్నది. ఇంతకుముందు మార్కెట్లోకి తీసుకొచ్చిన వన్ ప్లస్ పాడ్‌లో 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగా పిక్సెల్స్ రేర్ కెమెరా ఉన్నాయి. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 వర్షన్ పై ఈ టాబ్లెట్ పని చేస్తుందని భావిస్తున్నారు.
పవర్ బ్యాకప్ కోసం 8000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ యూఎస్బీ 2.0 టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఇంతకుముందు వన్ ప్లస్ పాడ్ 9510 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వచ్చింది. వన్ ప్లస్ పాడ్ గో టాబ్లెట్ 4జీ ఎల్టీఈ, వై-ఫై కనెక్టివిటీ ఆప్షన్లు కలిగి ఉంటుంది. ఈ-కామర్స్ వెబ్సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతోపాటు అధికారిక వెబ్సైట్లోనూ ‘వన్ ప్లస్ పాడ్ గో` టాబ్లెట్ సేల్స్ ప్రారంభం అవుతాయి.