OnePlus Open Apex | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తన వన్‌ప్లస్ ఓపెన్ (OnePlus Open) ఎపెక్స్ వేరియంట్ ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. వన్‌ప్లస్ ఓపెన్ (OnePlus Open) ఫోన్ ఆవిష్కరించాక దాదాపు ఏడాది తర్వాత రేర్‌లో ఫినిష్ లెదర్ తో ఫ్రెష్ రెడ్ షేడ్ ఆప్షన్లో ఆవిష్కరించింది. వన్‌ప్లస్ ఓపెన్ ఎపెక్స్ ఫోన్ కొత్త ర్యామ్ అండ్ స్టోరేజీ ఆప్షన్ లో అందుబాటులో వస్తోంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్ తో వస్తోంది. 7.82 అంగుళాల ఇన్నర్ డస్ ప్లే, 6.31 అంగుళాల అమోలెడ్ కవర్ స్క్రీన్ తో వస్తోంది.
వన్‌ప్లస్ ఓపెన్ (OnePlus Open) ఎపెక్స్ ఎడిషన్ ఫోన్ 16 జీబీ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్ రూ.1,49,999 పలుకుతుంది. లెదర్ బ్యాక్ ప్యానెల్ తో క్రిమ్సన్ షాడో కలర్ ఆప్షన్ లో వస్తోంది. గతేడాది అక్టోబర్‌లో ఆవిష్కరించిన వన్ ప్లస్ ఓపెన్ ఫోన్ 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.1,39,999 పలుకుతుంది. ఎమరాల్డ్ డస్క్, వోయాగర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
వన్‌ప్లస్ ఓపెన్ (OnePlus Open) ఎపెక్స్ ఎడిషన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది. 7.82 అంగుళాల (2268×2440 పిక్సెల్స్) 2కే ఫ్లెక్సీ ఫ్యూయిడ్ ఎల్టీపీఓ 3.0 అమోలెడ్ ఇన్నర్ డిస్ ప్లే, 6.31 అంగుళాల (1,116×2484 పిక్సెల్స్) 2కే ఎల్టీపీఓ 3.0 సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ కవర్ స్క్రీన్ కలిగి ఉంటుంది. బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్ తో పని చేస్తుంది.
వన్‌ప్లస్ ఓపెన్ (OnePlus Open) ఎపెక్స్ ఎడిషన్ ఫోన్ హెస్సెల్ బ్లాడ్ ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 48-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 808 సీఎంఓఎస్ ప్రైమరీ కెమెరా, 64- మెగా పిక్సెల్ ఒమ్నీ విజన్ ఓవీ64బీ సెన్సర్ విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ అండ్ 6ఎక్స్ సెన్సర్ జూ్, 48-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్581 ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతోపాటు సెల్ఫీల కోసం 20-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 32 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లో కెమెరాలు, మైక్రో ఫోన్లు తదితరాలను ప్రైవసీ కోసం బ్లాక్ చేసే ఫీచర్లు ఉంటాయి.
5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, బైదూ, ఏ-జీపీఎస్, క్యూజడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటది. యాక్సెలరో మీటర్, గైరో స్కోప్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఈ-కంపాస్, ఫ్లిక్ డిటెక్ట్ సెన్సర్, అంబియెంట్ లైట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉంటాయి. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్ కు మద్దతుగా ఉంటుంది. 67వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 4805 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటది.