OnePlus | డిసెంబర్లో భారత్ మార్కెట్లోకి వన్ప్లస్ ఏస్5 సిరీస్ ఫోన్లు..!
OnePlus | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (One Plus) తన వన్ ప్లస్ ఏస్5 (One Plus Ace5), వన్ ప్లస్ ఏస్5 ప్రో ( One Plus Ace 5 Pro) ఫోన్లను ఈ ఏడాది చివర్లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
OnePlus | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (One Plus) తన వన్ ప్లస్ ఏస్5 (One Plus Ace5), వన్ ప్లస్ ఏస్5 ప్రో ( One Plus Ace 5 Pro) ఫోన్లను ఈ ఏడాది చివర్లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా, ఇతర ఫ్లాగ్ షిప్ ఫోన్లలో వినియోగిస్తున్న క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 ఎస్వోసీ ప్రాసెసర్ను వన్ ప్లస్ ఏస్ 5 ఫోన్ లో వినియోగిస్తున్నారని సమాచారం. అక్టోబర్ 21-23 మధ్య హవేలీలో నిర్వహించే స్నాప్ డ్రాగన్ సదస్సులో వన్ ప్లస్ ఏస్ 5 ప్రో ఆవిష్కరిస్తారని భావిస్తున్నారు. ఇదే సదస్సులో షియోమీ తన షియోమీ 15 ప్రో ఫోన్ ఆవిష్కరించనున్నట్లు తెలుస్తున్నది. డిసెంబర్ లో భారత్ మార్కెట్లోకి వన్ ప్లస్ ఏస్5, వన్ ప్లస్ ఏస్5 ప్రో ఫోన్లు రానున్నాయని చెబుతున్నారు.
వన్ ప్లస్ ఏస్ 5 ఫోన్ 1.5 కే ఎల్టీపీఓతోపాటు 6.78 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 100 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6200 ఎంఏహెచ్ కెమపాసిటీ డ్యుయల్ సెల్ బ్యాటరీ వస్తుందని సమాచారం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

