OnePlus Ace 2 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నది. గతేడాది ఆగస్టులో విడుదల చేసిన వన్‌ప్లస్ ఏస్ ప్రో కొనసాగింపుగా వన్ ప్లస్ ఏస్2 ప్రో వస్తున్నది. బుధవారం చైనా మార్కెట్లోకి ఎంటరవుతున్న వన్‌ప్లస్ ఏస్2 ప్రో ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్, 150వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. భారత్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న సంగతి వెల్లడించలేదు.
వన్‌ప్లస్ ఏస్2 ప్రో ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 ప్రైమరీ రేర్ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో కూడిన రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. బయోనిక్ వైబ్రేటింగ్ మోటార్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఉన్నాయి. 24 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కేపాసిటీ కలిగి ఉంటుంది.
6.74-అంగుళాల ఓలెడ్ 1.5కే (1240×2772 పిక్సెల్) డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తున్నది వన్ ప్లస్ ఏస్2 ఫోన్. 450 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1600 నిట్స్ బ్రైట్ నెస్2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ రేట్ తోపాటు న్యూ ‘రెయిన్ టచ్’ టెక్నాలజీతో వస్తున్నది. దీనివల్ల వర్షం వస్తున్నప్పుడు కూడా టచ్ ఇన్ పుట్స్‌కు ఫోన్ రెస్పాండ్ అవుతుంది.
150 వాట్ల వైర్డ్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తుంది. ఈ బ్యాటరీ కేవలం 17 నిమిషాల్లో పూర్తిగా చార్జింగ్ అవుతుంది. వై-ఫై 6 వర్షన్ కనెక్టివిటీకి సపోర్ట్ గా ఉంటుందని తెలుస్తున్నది.