ఆన్లైన్లో వన్‌ప్లస్ 9 స్పెసిఫికేషన్ల హల్చల్

న్యూఢిల్లీ : వన్‌ప్లస్ 9 స్పెసిఫికేషన్లు, డిజైన్‌కు సంబంధించి లీకైనట్టు చెబుతున్న లైవ్ ఇమేజ్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. మార్కెట్లో త్వరలో సందడి చేయనున్న వన్‌ప్లస్ ఫోన్ హోల్ పంచ్ డిజైన్‌తో ఒంపు తిరిగిన డిస్ప్లేతో ఆకట్టుకుంటోంది. లేజర్ ఆటోఫోకస్ మాడ్యూల్తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ కస్టమర్ల ముందుకు రానుంది. లీకైన ఫోటోలో వన్‌ప్లస్ 9 సిల్వర్ కలర్ ఆప్షన్లో కనిపిస్తోంది. ఇతర షేడ్స్‌లోనూ ఈ ఫోన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఈతో పాటు వన్‌ప్లస్ 9 ఈ ఏడాది మార్చిలో మార్కెట్లోకి వస్తుందని అంచనా. ఇక ఐటీహోం రిపోర్ట్‌లో చూపిన వన్‌ప్లస్ 9 వెనుకవైపు రెక్టాంగ్యులర్ కెమెరా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ఫోటో ఆధారంగా ఫీచర్లను గమనిస్తే వన్‌ప్లస్ 9 క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ఎస్ఓసీని కలిగి 12 జీబీ ర్యాం, 256 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌లో అందుబాటులో ఉండనుంది. 6.54 అంగుళాల అమోల్ డిస్ప్లేతో పాటు రెండు 48 మెగాపిక్సెల్ సెన్సర్లు, ఒక 8 మెగాపిక్సెల్ సెన్సర్‌ను కలిగిఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11పై పనిచేస్తుంది. వన్‌ప్లస్ 9, 4500 ఎంహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ౩౦ వాట్స్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కివీస్‌తో టీ20.. 50 రన్స్ తేడాతో ఆసీస్ విజయం
- తాండవ్ వివాదం : అమెజాన్ ప్రైమ్ ఇండియా హెడ్ అపర్ణా పురోహిత్‌కు బెయిల్!
- పంత్ హాఫ్ సెంచరీ.. ఆధిక్యంపై కన్నేసిన భారత్
- క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
- ప్రధాని గడ్డంపైనా అర్థంపర్థం లేని వ్యాఖ్యలు: కర్ణాటక సీఎం
- కిస్ సీన్లలో నటించేందుకు రెడీ అంటోన్న అమలాపాల్..!
- కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్
- రోజూ పెరుగు తింటే జీర్ణ సమస్యలు దూరం..!
- వర్చువల్‌గా భేటీకానున్న బైడెన్, మోదీ
- ప్రియుడితో పారిపోయిన కుమార్తె.. హత్య చేసిన తండ్రి