OnePlus 13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ తన వన్ ప్లస్ 13 ఫోన్ ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ తో వస్తోందీ ఫోన్. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ ఫోన్ ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. వన్ ప్లస్ 13 సిరీస్ ఫోన్లతోపాటు వివో ఎక్స్200 సిరీస్, ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్, షియోమీ 15, ఐక్యూ 1, రియల్మీ జీటీ 7 ప్రో, రెడ్ మీ కే80 సిరీస్ ఫోన్లు కూడా మార్కెట్లోకి రానున్నాయని సమాచారం.
వన్ ప్లస్ 12 ఫోన్ కెమెరా సెటప్ తోపాటు వన్ ప్లస్ 13 ఫోన్ కొత్తగా సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తో వస్తుంది. సిరామిక్స్ బదులు గ్లాస్ రేర్ ప్యానెల్, కర్వ్డ్ ఫ్లాట్ డిస్ ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. వన్ ప్లస్ 13 ఫోన్ ఆల్ట్రాసోనిక్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. 100వాట్ల పాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 808 సెన్సర్ మెయిన్ కెమెరా ఉంటాయి.