OnePlus 12 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్.. దేశీయ మార్కెట్లోకి తన ఫ్లాగ్ షిప్ ఫోన్ ‘వన్ ప్లస్ 12’ ఆవిష్కరించనున్నట్లు తెలుస్తున్నది. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ తో రూపుదిద్దుకుంటున్నది. వన్ ప్లస్ 11 కొనసాగింపుగా వన్ ప్లస్ 12 ఫోన్ వస్తున్నది. 6.7-అంగుళాల కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 2కే రిజొల్యూషన్తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ డిసెంబర్ నాటికి మార్కెట్లోకి రానున్నదని తెలుస్తున్నది. ఈ ఫోన్ ధర రూ.60 వేల మధ్య ఉండొచ్చు.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ విత్ 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 9-సిరీస్ ప్రైమరీ కెమెరా, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, 64-మెగా పిక్సెల్ ఓమ్ని విజన్ ఓవీ 64బీ పెరిస్కోప్ లెన్స్ తో వస్తున్నది. 5000 ఎంఎహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 150 వాట్ల వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర, ఇతర ఫీచర్లు ఏమిటన్నది ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్, ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండొచ్చునని తెలుస్తున్నది.