Cars Sales | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా ఫ్యామిలీ మొత్తం కలిసి సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా సొంత కార్ల కొనుగోలుకు మొగ్గుతున్నారు. ఎస్యూవీ వేరియంట్ కార్లపై క్రేజీ పెంచుకుంటున్నారు. ఫలితంగా వివిధ రకాల కార్లకు గిరాకీ పెరుగుతున్నది. దీనివల్ల కార్లు బుక్ చేసుకున్న కస్టమర్లకు సకాలంలో వాటిని డెలివరీ చేయడంలో కార్ల తయారీ సంస్థలు వెనుకబడుతున్నాయి. ఫలితంగా కొత్త కారు బుక్ చేసుకున్నవారు ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని మోడల్ కార్లు ఏడు నుంచి 7.2 లక్షల యూనిట్ల కోసం ప్రీ-బుకింగ్ చేసుకున్న వారు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ వెయిట్ చేయాల్సిందే.
కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి గత నెలలో కేవలం 700 మిడ్‌సైజ్ సెడాన్లు మాత్రమే తయారు చేసింది. కేవలం 792 సియాజ్ కార్లు మాత్రమే విక్రయించింది. గతేడాదితో పోలిస్తే సియాజ్ కార్లకు డిమాండ్ 58.5 శాతం తగ్గిపోయింది. వివిధ రకాల మారుతి కార్ల కోసం ఇప్పటి వరకు ఏడు లక్షలకు పైగా కస్టమర్లు బుక్ చేసుకుంటే వాటిలో 3.69 లక్షల యూనిట్లు మాత్రమే మారుతి సుజుకి గత నెలలో డెలివరీ చేసింది. ఈ నెలాఖరు వరకు ఎన్ని యూనిట్లు డెలివరీ చేస్తామన్న విషయం చెప్పలేమన్నారు సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీఈవో శశాంక్ శ్రీవాత్సవ.
మారుతి సుజుకి తర్వాత కస్టమర్లు ఎక్కువగా మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ కార్లు బుక్ చేసుకున్నారు. రెండు లక్షలకు పైగా మహీంద్రా అండ్ మహీంద్రా కార్లు, టాటా మోటార్స్‌కు చెందిన వివిధ రకాల కార్ల కోసం లక్ష నుంచి 1.25 లక్షల యూనిట్ల కోసం బుకింగ్స్ ఉన్నాయని ఆటో డీటర్ల సంఘం అధ్యక్షుడు తాతా మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. హై ఎండ్ మోడల్ కార్ల కోసం బుకింగ్స్ వరద పోటెత్తిందన్నారు.
గత నెలలో కార్లకు డిమాండ్ పెరిగింది. 3.35 లక్షలకు పైగా కార్ల సేల్స్ జరిగాయి. గతేడాదితో పోలిస్తే 11 శాతానికంటే ఎక్కువ కార్లు అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు ఫిబ్రవరిలో జరిగిన సేల్స్ ఇటీవలి కాలంలో అత్యధికం. మారుతి సుజుకి, హ్యుండాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కార్లు 11 శాతం పెరిగాయి.