Omegle ShutDown | ఆన్లైన్ చాట్ ప్లాట్‌ఫాం ఒమెగల్ మూసివేత
సమస్యలతో సహవాసం చేస్తూ 14 ఏండ్ల ప్రస్ధానం అనంతరం ప్రముఖ ఆన్లైన్ చాట్ ప్లాట్‌ఫాం ఒమెగల్ (Omegle ShutDown) మూతపడింది.
న్యూయార్క్ : సమస్యలతో సహవాసం చేస్తూ 14 ఏండ్ల ప్రస్ధానం అనంతరం ప్రముఖ ఆన్లైన్ చాట్ ప్లాట్‌ఫాం ఒమెగల్ (Omegle ShutDown) మూతపడింది. చిన్నారులతో సంభాషించేందుకు పెడోఫిలిస్ వాడుతోందనే ఆరోపణలు ఒమెగల్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పెడోఫిలిస్ ఈ సైట్‌ను టూల్‌గా వాడుతున్నదనే అనుమానంతో పలు దేశాల్లోని ప్రభుత్వ ఏజెన్సీలు నిఘా పెట్టాయి. ఎన్నో కేసుల్లోనూ పరిశోధన సాగుతుండటం నిర్వాహకులను కలవరపరిచింది.
ఈ వెబ్‌సైట్‌ను ఇక ఎంతోకాలం నడిపే ఆర్ధిక స్ధోమత, మానసిక భారాన్ని తట్టుకునే సామర్ధ్యం తనకు లేవని ఒమెగల్ మూసివేత నిర్ణయాన్ని ప్రకటిస్తూ వ్యవస్ధాపకుడు లీఫ్ కే బ్రూక్స్ చేతులెత్తేశారు. ఒమెగల్‌ను నిర్వహిస్తూ ఇప్పటికే ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఖర్చుల భారానికి తోడు దాని దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్ధితి తనను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయని బ్లాగ్‌లో బ్రూక్స్ రాసుకొచ్చారు. 30ల్లోనే తనకు గుండె పోటు రావాలని తాను కోరుకోవడం లేదని అన్నారు.
బ్రూక్స్ 18 ఏండ్ల వయసులో 2009లో తన బెడ్రూమ్ నుంచే ఒమెగల్‌ను క్రియేట్ చేశారు. అపరిచితులు ఆన్లైన్ వేదికగా కలుసుకుని, కనెక్ట్ అవుతూ స్నేహితులుగా మారాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్‌ఫాంను డెవలప్ చేశారు. తన కాలేజీ రోజుల్లో సామాజిక ఇంటరాక్షన్ తనకు కొరవడటంతో ఆయన ఈ వెంచర్‌ను స్టార్ట్ చేశాడు. ఆపై ఒమెగల్‌కు మెరుగైన ఆదరణే లభించినా ప్లాట్‌ఫాం దుర్వినియోగమవుతుందనే ఆరోపణలు రావడంతో వెబ్సైట్ ప్రతిష్ట మసకబారింది.
Read More :
Bengaluru Traffic | ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన ఫెరారీ సూపర్ కార్లు.. VIDEO
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

